హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 6 (నమస్తే తెలంగాణ): ఆధునిక చికిత్స విధానం తో బ్లడ్ క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయవచ్చని యశోద వైద్యులు నిరూపించారు. సో మాజిగూడ యశోద హాస్పిటల్లో బ్లడ్ క్యాన్సర్‌ను జయించిన విజేతలతో సోమవారం ‘బ్ల డ్ క్యాన్సర్ సర్వైవల్స్ సమ్మిట్’ నిర్వహించారు. సమ్మిట్‌ను యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి, హిమాటో ఆంకాలజిస్ట్, బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ గణేశ్ జైషత్వర్తో కలిసి ప్రారంభించా రు.
ఈ సందర్భంగా డాక్టర్ పవన్ గోరుకంటి మాట్లాడుతూ.. బ్లడ్ క్యాన్సర్లపై అవగాహన కల్పించడంతోపాటు పూర్తిగా చికిత్స పొంది సాధారణ జీవితం గడుపొచ్చని చెప్పేందుకు ఈ సమ్మిట్ నిర్వహించినట్టు తెలిపారు.
డాక్ట ర్ గణేశ్ జైషత్వర్ మాట్లాడుతూ వయస్సుతో సంబంధం లేకుండా క్యాన్సర్ వస్తుందని, ఏ డాదికి లక్ష మందిలో 5.5 శాతం రక్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన 65 ఏండ్ల వెంకటేశ్వర్రావుకు తన కుమార్తె మూలకణం సరిపోలడంతో హిప్‌లో ఒకేలా మూలకణ మార్పిడి చికిత్స చేశామని, ఇది దేశంలోనే తొలి చికిత్స అని చెప్పారు. తమ దవాఖానలో చేరిన ఇద్దరు సోదరుల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి అంతర్జాతీయ దాత మూలకణాలను వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. గడిచిన ఎనిమిదేండ్లలో 300కు పైగా బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు నిర్వహించిన ఘనత యశోద హాస్పిటల్ సాధించిందని ఆయన వివరించారు.