యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి పుణ్యక్షేత్రంలో శుక్రవారం భక్తుల శ్రావణ పూజల సందడి నెలకొంది. భక్తుల స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేప ట్టారు. మరోవైపు స్వామి వారి నిత్యారాధనలు అత్యంత వైభవంగా కొనసాగాయి.
తెల్లవారు జాము మూడు గంటల నుంచి మొదలైంది. నిజాబిషేకంతో ఆరాధనలు ప్రారంభిం చారు. ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీ నరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు.
హారతి నివేదనలు అర్పించారు. ఉదయం 8 గంటలకు నిర్వహించిన సుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ప్రతి రోజూ నిర్వహించే నిత్య తిరుకల్యాణోత్సంలో భక్తులు పాల్గొ న్నారు. సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొన్న భక్తులు స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.