వినాయక్‌నగర్, ఫిబ్రవరి 14: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి పోలీసులపై నోరు పారేసుకున్నారు. ఎంపీ అర్వింద్ శనివారం నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ‘పోలీసులు నామీద కేసు పెట్టడం ఏంది? నేనే వాళ్ల మీద కేసు పెడతా. మా క్యాండిడేట్‌ను పోలింగ్ నుంచి బయటకు వెళ్లగొట్టారు. ఒక పోలీసోడు వచ్చి చేతి గుర్తుకు ఓటు వేయమంటాడు. ఓ కార్పొరేటర్‌ను ఎత్తుకు రావడానికి కాంగ్రెసోళ్లకు సహాయం చేస్తారు. పోలీసులు ఉన్నది లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికా.. లేక బ్రేక్ చేయడానికా?’ అని వ్యాఖ్యానించారు. కార్పొరేటర్ ఇంటి వద్ద ఏసీపీ, సీఐలు, పోలీసులు ఎందుకు ఉన్నారు. అక్కడ ఏం పీకుతున్నారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ వాళ్లకు ఆత్మాభిమానం చచ్చిపోయిందని, ఒవైసీ వచ్చి కులం లేదు, మతం లేదు, విష పాములు అన్నా కూడా స్పందించరని మండిపడ్డారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ కల్మా చదువుకొని ఎంఐఎంతో పొత్తు పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిపై నమోదైన ఓటుకు నోటు కేసులో ఆలస్యంపై ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. ఎందుకు జాప్యం జరుగుతున్నదో కనుక్కోవాలని కిషన్‌రెడ్డిని అడిగానని తెలిపారు.