యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి : వరుస సెలవుల కారణంగా యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. భక్తులు క్యూలో నిలబడి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆలయానికి రూ. 58,58,934 ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు.
ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 8,06,450, సుప్రభాతం ద్వారా రూ. 7,000 , పుష్కరిణీ ద్వారా రూ. 1,650, వ్రతాలు ద్వారా రూ. 2,25,800, ప్రచార శాఖ ద్వారా రూ. 23,600 ద్వారా ఆదాయం వచ్చిందన్నారు. వీఐపీ (VIP) దర్శనం ద్వారా రూ. 5,40,000, యాదరుషి నిలయము ద్వారా రూ. 2,04,056, ప్రసాదవిక్రయం ద్వారా రూ. 23,04,100, పాతగుట్ట ద్వారా రూ. 88,660, కళ్యాణ కట్ట ద్వారా రూ. 1,89,500, శాశ్వత పూజలు ద్వారా రూ. 17,500 ఆదాయం సమకూరిందని వెల్లడించారు.
వాహన పూజల ద్వారా రూ. 20,300, కొండపైకి వాహన ప్రవేశాల ద్వారా ద్వారా రూ. 6,50,000 , సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 2,12,760, శివాలయం ద్వారా రూ. 15,100 , అన్నదానము ద్వారా రూ. 18,533 , బ్రేక్ దర్శనం ద్వారా రూ. 4,85,400, క్లాక్ రూమ్ మొబైల్ కౌంటర్ ద్వారా రూ. 48,525 ఆదాయం ఆలయానికి వచ్చిందన్నారు.