యాదగిరిగుట్ట, జూన్ 16: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల తహసీల్దార్ వీ శోభన్‌బాబును సస్పెండ్ చేస్తూ హైదరాబాద్‌లోని సీసీఎల్ఏ కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. యాదగిరిగుట్టకు చెందిన ఓ రైతుకు పట్టాదారు పాసు పుస్తకాన్ని ఇచ్చేందుకు శోభన్‌బాబు గురువారం లంచం డిమాండ్ చేయడం, దాన్ని బాధితుడు వీడియో తీయడం వైరల్‌గా మారింది.
దీంతో భువనగిరి ఆర్డీవో భూపాల్‌రెడ్డి శుక్రవారం యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. ఈ మేరకు శోభన్‌బాబును సస్పెండ్ చేస్తున్నట్టు సీసీఎల్ఏ కార్యాలయం ప్రకటించింది.