యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి (Laxmi Narasimha Swamy) ఆలయానికి భక్తుల తాకిడి పెరుగుతుంది. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. దీంతో ఆలయానికి భక్తులు సమర్పించిన మొక్కులు, ఇతర కొనుగోళ్లు ద్వారా రూ. 57. 65 లక్షల ఆదాయం ( Income) వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు.
ప్రధాన బుకింగ్ (Main Booking ) ద్వారా రూ. 3,46,100, కైంకర్యములు ద్వారా రూ. 2,200, సుప్రభాతం ద్వారా రూ. 12,800, బ్రేక్ దర్శనం ద్వారా రూ. 4,44,600 ఆదాయం వచ్చిందన్నారు. వ్రతాల ద్వారా రూ. 4,13,600 , వాహన పూజల ద్వారా రూ. 29,700 , వీఐపీ దర్శనం ద్వారా రూ. 7,05,000, ప్రచారశాఖ ద్వారా రూ. 42,995 ఆదాయం సమకూరిందని వివరించారు.
పాతగుట్ట ద్వారా రూ. 79,830 , కొండపైకి వాహనాల ప్రవేశం ద్వారా రూ. 7 లక్షలు, యాదఋషి నిలయం ద్వారా రూ. 2,52,738 , సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 1,66,400 , శివాలయం ద్వారా రూ. 15,800, పుష్కరిణీ ద్వారా రూ. 2,000, ప్రసాదవిక్రయం ద్వారా రూ. 19,79,960 ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. శాశ్వత పూజల ద్వారా రూ. 30,000, కల్యాణ కట్ట ద్వారా రూ. 1,63,000, లీజేస్ లీగల్ ద్వారా రూ. 2,00,000, అన్నదానం ద్వారా రూ. 1,78,494 ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు.