యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి 22 రోజుల హుండీల ఆదాయం రూ. కోటి దాటిందని యాదాద్రి ఆలయ ఈవో ఎన్.గీత తెలిపారు. గురువారం యాదాద్రి కొండపైన హరిత హోటల్లో హుండీలను లెక్కించామని, నగదు రూ.1,20,27,394 ఆదాయం వచ్చిందని తెలిపారు. మిశ్రమ బంగారం 310 గ్రాములు, మిశ్రమ వెండి నాలుగు కిలోల 500 గ్రాములు వచ్చిందని తెలిపారు.
శ్రీవారి ఖజానాకు రూ. 12,99,075 ఆదాయం
శ్రీవారి ఖజానాకు రూ. 12,99,075 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 2,38,402, రూ. 100 దర్శనంతో రూ. 95,000, నిత్య కైంకర్యాల ద్వారా రూ. 1,200, సుప్రభాతంతో రూ. 1,000, క్యారీబ్యాగులతో రూ. 4,400, సత్యనారాయణ వ్రతాల ద్వారా రూ. 1,45,000 , కల్యాణకట్టతో రూ. 34, 400, ప్రసాద విక్రయంతో రూ. 5,06,505, వాహనపూజలతో రూ. 8,600, టోల్గేట్తో రూ. 1,110, అన్నదాన విరాళంతో రూ. 6,580, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 1,00,760, యాదరుషి నిలయంతో రూ. 67,360, పాతగుట్టతో రూ. 52,410 తో కలుపుకుని రూ. 12,99,075 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.