యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే సత్యనారాయణ స్వామివారి వ్రతాల్లో భక్తులు పాల్గొన్నారు. సామూహిక వ్రతాలు పెద్ద ఎత్తున జరిగాయి. వ్రతాల ద్వారా రూ. 2,13,500 ఆదాయం సమకూరింది. సత్యనారాయణుడిని ఆరాధిస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
స్వామి వారిని దర్శించుకున్న ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని రాష్ట్ర పుడ్ కార్పొరేషన్ చైర్మన్ తిరుమల రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు స్వామి వారి ఆశీర్వచనం, ప్రసా దం అందజేశారు.
స్వామి వారి హుండి ఏర్పాటుకు రూ. 5 లక్షల విరాళం..
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయంలో స్వామివారి హుండి ఏర్పాటుకు సికింద్రాబాద్కు చెందిన ఓ భక్తుడు మందుకు వచ్చాడు. అఖిల భారత పద్మశాలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోపాల్ కె. గోరంటి రూ. 5 లక్షల చెక్కును ఆదివారం యాదాద్రి ఈవో కార్యాలయంలో ఈవో గీతకు అందజేశాడు.