యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజల కోలాహలం నెలకొంది. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను పంచామృతాలతో అభిషేకించారు. తులసీదళాలతో అర్చించి అష్టోత్తర పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. ఆలయ మండపంలో సుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యా ణం జరిపించారు. కొండపైన ఉన్న పర్వతవర్ధనీ రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన జరిపారు.
కొండకింద భక్తులు పుణ్యస్నానం ఆచరించి సంకల్పంలో పాల్గొన్నారు. రాత్రి బాలాలయంలోని ప్రతిష్ఠమూర్తులకు ఆరాధ న, సహస్రనామార్చన జరిగాయి. శ్రావణమాసం సందర్భంగా యా దాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకు నే సత్యనారాయణ స్వామి వారి వ్రతాల్లో భక్తులు పాల్గొన్నారు. సామూహిక వ్రతాలు పెద్ద ఎత్తున జరిగాయి. వ్రత పూజల ద్వారా రూ. 62,500 ఆదాయం సమకూరింది. శ్రీసత్యనారాయణుడిని ఆరాధిస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు.