యాదాద్రి: యాదాద్రి అనుబంధ ఆలయమైన శివాలయంలో స్టీల్‌తో తయారు చేసిన ప్రత్యేక క్యూలైన్ల బిగింపు పనులు సాగుతున్నాయి. శివాలయంలోని తూర్పు ప్రధాన ద్వారం వద్ద నుంచి ఆలయ తిరువీధుల్లో గల ప్రాకారంలో క్యూలైన్లను బిగించారు.
భక్తులు ప్రధానాలయ స్పటిక లింగాన్ని దర్శించుకుని ఉత్తర భాగంలో గల ద్వారం గుండా బయటకు వెళ్లే విధంగా స్టీల్ క్యూ లైన్లను బిగిస్తున్నారు. సుమారు 500 అడుగుల మేరకు స్టీల్ క్యూలైన్లను బిగింపు ప్రక్రియ చివరిదశకు చేరుకుంది.