GHMC | మూడు కార్పొరేషన్లుగా విడిపోయిన జీహెచ్ఎంసీ.. కొత్త కమిషనర్లు వీరే!
GHMC | జీహెచ్ఎంసీని రాష్ట్ర ప్రభుత్వం మూడు కార్పొరేషన్లుగా విభజించింది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు గ్రేటర్ సైబరాబాద్, గ్రేటర్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
GHMC | జీహెచ్ఎంసీని రాష్ట్ర ప్రభుత్వం మూడు కార్పొరేషన్లుగా విభజించింది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు గ్రేటర్ సైబరాబాద్, గ్రేటర్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుత పాలకమండలి ఐదేళ్ల గడువు నిన్నటితో ముగిసింది. దీంతో ఇవాల్టి నుంచి గ్రేటర్ ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్లనుంది. ఈ క్రమంలో మూడు కార్పొరేషన్ల విభజనను రాష్ట్ర ప్రభుత్వం ఇవాల్టి నుంచి అమలులోకి తీసుకొచ్చింది. ఈ మూడు కార్పొరేషన్లకు కొత్త కమిషనర్లను నియమించింది. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్‌ను యథాతథంగా కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా శ్రీజన, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా వినయ్ కృష్ణా రెడ్డిని నియమించింది.
జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించిన నేపథ్యంలో జలమండలి పరిధిని కూడా ఓఆర్ఆర్ వరకు రాష్ట్ర ప్రభుత్వం విస్తరించింది. జలమండలి పరిధి విస్తరించడంతో ముగ్గురు అధికారులను ఈడీలుగా నియమించింది. ఇప్పటివరకు జలమండలి ఈడీగా ఉన్న ఐఏఎస్ మయాంక్ మిట్టల్‌కు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. మల్కాజిగిరి కార్పొరేషన్‌కు సంబంధించి జలమండలి ఈడీగా పంకజను నియమించారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించి జలమండలి ఈడీగా సామ్రాట్ అశోక్ నామాకు పోస్టింగ్ ఇచ్చారు. అలాగే సైబరాబాద్‌కు సంబంధించి జలమండలి ఈడీగా రంగారెడ్డి రిజిస్ట్రార్‌గా ఉన్న సంతోశ్‌లను కూడా జలమండలి ఈడీలుగా నియమించారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్డు పరిదిలోని నీటి సరఫరా, సివరేజ్ నిర్వహణను జీహెచ్ఎంసీ నుంచి జలమండలికి రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- GCMC
- GHMC
- GMMC
- jalamandali
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

