Usman Tariq : భారత్, శ్రీలంక ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్‌లో చిన్న జట్లు నేపాల్, యూఎస్ఏ అద్భుత పోరాట పటిమతో ఔరా అనిపిస్తున్నాయి. కొన్ని జట్లేమే ప్రధాన అస్త్రంగా కొత్త బౌలర్లతో బరిలోకి దిగుతున్నాయి. వీరిలో పాకిస్థాన్ స్పిన్నర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. అతడే ఉస్మాన్ తారీఖ్ (Usman Tariq). తన వింత బౌలింగ్ యాక్షన్‌తో ప్రమాదకరమైన బౌలర్‌గా మారిన అతడికిస్ఫూర్తి ఎవరో తెలుసా?.. ఇంకెవరు మన మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni). అవును.. ధొనీ బయోపిక్ చూశాక క్రికెటర్ అవ్వాలని నిర్ణయించుకున్న తారీఖ్ ఇప్పుడు ప్రపంచకప్‌లో తన తికమక యాక్షన్‌తో వైరలవుతున్నాడు.
ప్రపంచకప్‌లో స్పెషలిస్ట్ బ్యాటర్లు, బౌలర్లు సంచలన ప్రదర్శనతో మ్యాచ్‌ను మలుపుతిప్పుతూ వార్తల్లో నిలుస్తుంటారు. కానీ, పదో సీజన్లో బౌలింగ్ యాక్షన్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది మాత్రం ఉమర్ తారీఖ్ ఒక్కడే. అవును.. అతడు బౌలింగ్ బంతిని త్రో చేసినట్టు… నేరుగా విసిరేసినట్టే ఉంటుంది. దాంతో.. బ్యాటర్లు ‘ఇదేం బౌలింగ్ రా స్వామి.. బంతిని ఎప్పుడు విసురుతాడు? ఏ దిశలో వేస్తాడు?’ అనే అంచనాకు రాలేక తలలు పట్టుకుంటున్నారు. శ్రీలంక దిగ్గజాలు ముత్తయ్య మురళీధరన్, అజంత మెండిస్, సునీల్ నరైన్(వెస్టిండీస్), వరుణ్ చక్రవర్తి(భారత్) వంటి వైవిధ్యమైన స్పిన్నర్లను చూశాం. కానీ, తారీఖ్ మాత్రం వీరికంటే ప్రత్యేకమని చెప్పాలి.
Is it illegal or irritating bowling action of Usman Tariq? pic.twitter.com/UZ8WK73Bx7
— TukTuk Academy (@TukTuk_Academy) February 10, 2026
Pakistan’s Usman Tariq says he gave himself another shot at cricket after being inspired by the train scene from MS Dhoni: The Untold Story. pic.twitter.com/ynyNXcVtIe
— Ragav X (@ragav_x) February 6, 2026
ఇంతకూ మనోడు క్రికెటర్ అవ్వడానికి కారణం టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ. ఒకప్పుడు పాక్ జట్టులో అవకాశాల కోసం నిరీక్షించి విసిగెత్తిన అతడు దుబాయ్‌లో సేల్స్‌మెన్‌గా చేరాడు. ఒకరోజు అతడు ధోనీ బయోపిక్ (M.S. Dhoni: The Untold Story) చూశాక మళ్లీ తనలో ఆడాలనే ఉత్సాహం వచ్చిందని ఒకానొక సందర్భంలో సందర్భంలో అతడే స్వయంగా చెప్పాడు. స్పిన్ బౌలర్‌గా రాటుదేలిన అతడు ఇప్పుడు వరల్డ్‌కప్‌లో మిస్టరీ బౌలర్‌గా అవతరించాడు. తారీఖ్ యాక్షన్ చక్లింగ్.. అంటే నిబంధనల ప్రకారం చేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువ దూరం తీసుకెళ్లకూడదు. కానీ, మనోడు మాత్రం అందుకు మినహాయింపు.
Why this batta bowler is still playing for Pakistan ?
BCCI should make sure to ban this chucker usman tariq before 15th february match.pic.twitter.com/3x5geFSx1g
— 𝗬𝗼𝗿𝗸𝗲𝗿 (@ImYorker93) February 10, 2026
ఎందుకో తెలుసా.. అతడికి అతడి కుడి చేయి నిర్మాణం సరిగా లేదు. ఇదే విషయంలో తారీఖ్‌కు ఊరట లభించింది. స్వదేశంలో పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్(PSL)లో క్వెట్టా గ్లాడియేటర్స్‌కు ఆడిన అతడు 5 మ్యాచుల్లో 10 వికెట్లు తీశాడు. అయితే.. ఆ లీగ్ సమయంలోనే రెండుసార్లు అతడి బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదులు వచ్చాయి. కానీ, అతడికి పాక్ బోర్డు క్లీన్‌చీట్ ఇచ్చింది. నిరుడు దక్షిణాఫ్రికాపై అరంగేట్రం చేసిన తారీఖ్ అత్యుత్తమ ప్రదర్శన 4/18.
వరల్డ్‌కప్‌లో తమకు స్పిన్ అస్త్రంగా పనికొస్తాడని అతడిని ప్రపంచకప్ స్క్వాడ్‌లోకి తీసుకుంది పాక్. శ్రీలంక స్పిన్నర్లు ప్రభావం చూపుతారనే ఉద్దేశంతో అతడిని ఎంపిక చేశారు. తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై .. రెండో మ్యాచ్‌లో యూఎస్ఏ బ్యాటర్లను తికమక పెట్టి మూడు వికెట్లు తీశాడీ మిస్టరీ స్పిన్నర్. వివాదాస్పదంగా బౌలింగ్ చేస్తున్న తారీఖ్పై ఐసీసీకి ఇంకా ఫిర్యాదులు అందలేదు. ఒకవేళ ఎవరైనా అభ్యంతరం తెలిపితే.. అతడి బౌలింగ్‌ను పరీక్షించే అవకాశముంది.