
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ.14,74,417 ఆదా యం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ.2,43,978, రూ.100 దర్శనంతో రూ.25,000, వీఐపీ దర్శనాల ద్వారా రూ.1, 33,650, సుప్రభాతంతో రూ.200, క్యారీ బ్యాగులతో రూ.4,030, సత్యనారాయణ స్వామి వ్రతాలతో రూ.1,16, 500, కల్యాణ కట్టతో రూ. 37,000, ప్రసాద విక్రయంతో రూ.4,87,520, శాశ్వత పూజలతో రూ.6,000,
వాహన పూజలతో రూ.9,300, టోల్గేట్తో రూ.1,670, అన్నదాన విరాళంతో రూ.6,203, సువర్ణ పుష్పార్చనతో రూ.1, 34,500, యాదరుషి నిలయంతో రూ. 78,040, పాతగుట్టతో రూ.32,335, ఇతర విభాగాలతో రూ.1,58,491తో కలుపుకొని రూ. 14,74,417 ఆదాయం సమకూరిందన్నారు.