సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత వై.సతీశ్ రెడ్డి సెటైర్లు గుప్పించారు. మసిబూసి మారేడుకాయ చేయడం అంటే తెలుసా అని ప్రశ్నించిన ఆయన.. తెలంగాణ ప్రజలకు ఈ సామెత తెలియదని రేవంత్ రెడ్డి పాత అనుభవాన్ని వాడి చేసి చూపెడుతున్నడు చూడండి అని విమర్శించారు.
పల్లె వెలుగు బస్సులకు పెయింట్ వేసి ఎక్స్ప్రెస్ బస్సుగా మార్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చార్జీలు వసూలు చేస్తున్నదని సతీశ్ రెడ్డి తెలిపారు. పల్లె వెలుగు ఫ్రీ బస్.. ఎక్స్ప్రెస్ పెయిడ్ బస్ అని విమర్శించారు. కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లకు మూడు రంగులు వేసి ఇందిరమ్మ ఇళ్లు చేసిండని అన్నారు. పాత స్కూల్కు రంగులేసి తెలంగాణ పబ్లిక్ స్కూల్ చేసిండని విమర్శించారు.
మసిబూసి మారేడుకాయ చేయడం అంటే తెలుసా❓
తెలంగాణ ప్రజలకు ఈ సామెత తెలియదని
రేవంత్ రెడ్డి పాత అనుభవాన్ని వాడి చేసి చూపెడుతున్నడు చూడండి…పల్లె వెలుగు బస్సులకు పెయింట్ వేసి ఎక్స్ప్రెస్ బస్సుగా మార్చి ఎక్కువ ఛార్జీలు వసూల్ చేస్తున్న రేవంత్ ప్రభుత్వం.
👉పల్లె వెలుగుకి పెయింట్ వేసి… pic.twitter.com/702hd2YcUZ
— YSR (@ysathishreddy) June 28, 2026