హైదరాబాద్ : రాష్ట్రంలో నడుస్తున్నది కాంగ్రెస్(Y. Satish Reddy) ప్రభుత్వమో.. సర్కస్ కంపెనీనో అర్థం కావడం లేదని రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీష్ రెడ్డి(Y. Satish Reddy) విమర్శించారు. సోమవారం పలు కార్పొరేషన్లకు చైర్మన్స్‌ను(Corporation Chairman posts) కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..35 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమి స్తున్నట్టు పాత తేదీతో జీవో ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలన ఓ పద్ధతి పాడు లేకుండా ఉంటుందనడానికి ఇదే నిదర్శనం అన్నారు.
సర్కారు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నప్పుడు అలా చేయకుండా చూడాల్సిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కార్పొరేషన్ చైర్మన్లను నియమిస్తూ మార్చి నెల 15వ తేదీతో జీవో ఇవ్వడమే దీనికి నిదర్శనం. ఇవాళ జీవోలు బయటకు ఇచ్చారు. ఒక వేళ మార్చి 15వ తేదీనే జీవో ఇచ్చి ఉంటే ఇప్పటి దాకా ఎందుకు బయటకు రాలేదు. ప్రభుత్వ వెబ్ సైట్లో ఎందుకు పొందుపరచలేదని నిలదీశారు.
నాలుగు నెలలుగా వీళ్లు బాధ్యతలు ఎందుకు తీసుకోలేదు. ఇప్పుడు బాధ్యతలు తీసుకుని నాలుగు నెలల వేతనాలు తీసుకుంటారా.? ప్రజల సొమ్ముని మీ పార్టీ నేతల జేబుల్లోకి మళ్లించుకుంటారా.? ఏ పని చేయ కుండా జనం సొమ్ము దోచుకుంటారా.? లేకపోతే జీవో ఇప్పుడే ఇచ్చి పాత తేదీ వేశారా.? రాష్ట్ర ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. ఇది రాష్ట్ర కాంగ్రెస్‌లోని అంతర్గత గొడవలకు ఈ కేటాయింపులు అద్దం పడుతున్నాయన్నారు. పదవుల పంపకాల విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు కాబట్టే ఇన్ని రోజులు ఆపారు.
ఢిల్లీ వెళ్లి కుస్తీ పట్టారు. ముఖ్యమంత్రి, మంత్రుల మధ్యే కార్పొరేషన్ పదవుల కోసం ఫైటింగ్ నడుస్తున్నదని ఎద్దేవా చేశారు. అందుకే ఇన్ని రోజుల పాటు జీవోలు దాచిపెట్టారు. మరోవైపు.. కాంగ్రెస్ సర్కారు పూర్తికాలం ఉంటుందో లేదోననే భయం ఆపార్టీకి పట్టుకుంది. అందుకే హడావుడిగా జీవోలు ఇచ్చినట్టుగా కనిపిస్తుంద న్నారు. పదవీకాలం ఎక్కువ చూపించుకుని, తమవాళ్లకు జీతాల పేరుతో ప్రజాధనాన్ని దోచిపెట్టడానికే ఇదంతా చేస్తున్నారని విమర్శించారు.