హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : అగ్ని ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పించి.. సురక్షిత భారతాన్ని నిర్మిద్దామని తెలంగాణ రాష్ట్ర అగ్నిమాపక, డిజాస్టర్ రెస్పాన్స్ డైరెక్టర్ జనరల్ వై నాగిరెడ్డి పిలుపునిచ్చారు. 2025 అగ్నిమాపక సేవావారం సందర్భంగా అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాలు సంభవిస్తే చేపట్టాల్సిన నివారణ చర్యలపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్టు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 14న అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణతో మొదలై.. ఆదివారం నెక్లెస్‌రోడ్డులో 5కే రన్‌తో ముగిశాయని తెలిపారు.