హైదరాబాద్, మే 17(నమస్తే తెలంగాణ): గ్రామ పాలన అధికారి(జీపీవో) పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వీఆర్వో, వీఆర్ఏలకు ఈ నెల 25న రాత పరీక్ష(స్క్రీనింగ్ టెస్ట్) నిర్వహిస్తున్నట్టు సీసీఎల్ఏ ప్రధాన కమిషనర్ నవీన్‌మిట్టల్ తెలిపారు. ఉదయం 10:30 నుంచి మ ధ్యాహ్నం 1:30 వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు.
హాల్‌టికెట్లు సీసీఎల్ఏ వెబ్సైట్లో అం దుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. గ్రామా ల్లో రెవెన్యూ సేవలు అందించేందుకు గ్రామ పాలన అధికారుల పేరుతో 10,954 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీపీవోలుగా పని చేసే అవకాశాన్ని తొలుత పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏలకు కల్పించింది.