హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : రోగులకు మెరుగైన ఫలితాలు అందించాలంటే వైద్యులు ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని కిమ్స్ దవాఖాన సీఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు సూచించారు. డెర్మటోసర్జరీపై ఆదివారం సికింద్రాబాద్‌లోని ‘కిమ్స్’ ప్రాంగణంలో వర్క్‌షాప్ నిర్వహించారు. ఏసీఎస్(ఐ) ఆధ్వర్యంలో జరిగిన ఈ వర్క్‌షాప్‌లో శరీర గాయాలకు కుట్లువేసే టెక్నిక్‌లపై పలువురు డెర్మటాలజిస్టులకు శిక్షణ ఇచ్చారు. డాక్టర్ కొణతం రాజ్యలక్ష్మి నేతృత్వంలో సాగిన ఈ వర్క్‌షాప్‌లో డాక్టర్ అంచల పార్థసారథి, డాక్టర్ ఏఎస్ కుమార్, డాక్టర్ నితిన్ జైన్, డాక్టర్ యోగేశ్ భింగ్రాడియా, డాక్టర్ నందిత, డాక్టర్ నితిన్ బార్డే, డాక్టర్ మానస్ రంజన్ ఫుకాన్, డాక్టర్ తేజస్విని సలుంకే, డాక్టర్ ఆనంద్ వగ్గు, డాక్టర్ గంప జ్యోత్స్న, డాక్టర్ రాకేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. భారత్, నేపాల్‌కు చెందిన 300 మందికిపైగా డెర్మటాలజిస్టులు ఈ వర్క్‌షాప్‌నకు హాజరయ్యారు.