వారమైనా నిందితుడిని అరెస్టు చేయరా?
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై నమోదైన పోక్సో కేసులో ఎఫ్ఐఆర్ నమోదై వారం గడుస్తున్నా, నిందితుడిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
- పోక్సో కేసులో అధికార దుర్వినియోగం
- ఏఐఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర
- కండ్లకు గంతలు కట్టుకుని నిరసన
హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ) : కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై నమోదైన పోక్సో కేసులో ఎఫ్ఐఆర్ నమోదై వారం గడుస్తున్నా, నిందితుడిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కేసు విషయంలో రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తున్నదని ఆరోపించారు. పోక్సో కేసు దర్యాప్తు విషయంలో జరుగుతున్న తాత్సారంపై ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్లో కండ్లకు గంతలు కట్టుకొని యువకులు నిరసన వ్యక్తంచేశారు.
అనంతరం ధర్మేంద్ర మాట్లాడుతూ.. ఈ కేసు విషయంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుపాలని, బాధితురాలి హక్కులను కాపాడేలా వ్యవహరించాలని కోరారు. ఇలాంటి కేసుల విషయంలో అధికార పార్టీలకు వరకు వచ్చేసరికి చట్టం నత్తనడకన నడవడం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని పేర్కొన్నారు. న్యాయస్థానం చట్టపరమైన ప్రమాణాలను కచ్చితంగా అమలు చేస్తూ, బాధితురాలికి భద్రత, న్యాయం జరిగేలా చొరవ చూపాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

