మంగపేట, సెప్టెంబర్ 5: తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరులో మహిళలు శుక్రవారం ఖాళీ బిందెలతో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 8 నెలలుగా తాగునీటికి గోస పడుతున్నా గ్రామపంచాయతీ అధికారులు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. మల్లూరులోని రామాలయం నుంచి మొట్లగూడెం వరకు తాగునీరు సరఫరా కావడంలేదని తెలిపారు. మూడు రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు సైతం రావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. సమస్యను పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.