ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 25, 2020 , 01:21:05

కుట్టు శిక్షణతో మహిళలు ఎదగాలి

కుట్టు శిక్షణతో మహిళలు ఎదగాలి

  • వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి 

వనపర్తి: కుట్టు శిక్షణతో మహిళలు ఆర్థికంగా ఎదగాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆకాంక్షించారు. బుధవారం వనపర్తి జిల్లాకేంద్రంలో ఉమెన్స్‌ సోషల్‌ వెల్ఫేర్‌ సొసైటీ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో కుట్టుమిషన్‌ శిక్షణా కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళలు స్వయం ఉపాధితో రాణించాలని సూచించారు. అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగితే కుటుంబ పోషణకు ఢోకా ఉండదన్నారు. కుట్టు శిక్షణ కేంద్రం భవనాన్ని 400 గజాల స్థలంలో నిర్మిస్తామని నిరంజన్‌రెడ్డి ప్రకటించారు. logo