AP CM Jagan | కూటమికి ఓట్లేస్తే పథకాలన్నీ రద్దు : ఏపీ సీఎం జగన్
AP CM Jagan | ఇంటింటికి ప్రభుత్వ పథకాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వా్నిదేనని , పొరపాటున చంద్రబాబు కూటమికి ఓటేస్తే పథకాలన్నీ రద్దు అవుతాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.
అమరావతి : ఇంటింటికి ప్రభుత్వ పథకాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వా్నిదేనని , పొరపాటున చంద్రబాబు కూటమికి ఓటేస్తే పథకాలన్నీ రద్దు అవుతాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ ( CM Jagan ) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ జిల్లాలో జరుగుతున్న మేమంతా సిద్ధం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ( Chandra Babu) సాధ్యం కాని హామీలిస్తున్నాడని విమర్శించారు.
రాష్ట్రాన్ని దోచుకునేందుకు కూటమిగా ఏర్పడ్డారని ఆరోపించారు. 2014లో కూటమి తరఫున పోటీ చేసి ఇచ్చిన రుణమాఫీ, పొదుపు సంఘాల రుణమాఫీ, అర్హులైన వారికి మూడుసెంట్ల స్థలం ఇవ్వలేదని, సింగాపూర్‌కు మించి నగరాలను నిర్మించలేదని ఆరోపించారు. ఈ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు వద్ద ప్యాకేజీలు తీసుకున్నారని దుయ్యబట్టారు. పెళ్లిళ్ల పేరిట వివాహవ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారని అన్నారు. జ్వరం వచ్చినా హైదరాబాద్‌కు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటూ పిఠాపురాన్ని అవమానపరుస్తున్నాడని పేర్కొన్నారు. బాబు ప్రయోజనం కోసం సొంత పార్టీ అభ్యర్థులను సైతం మార్చివేస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్ కోసం వైసీపీని గెలిపించాలని కోరారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

