Salvaji Madhav Rao | సల్వాజీ మాధవ్ రావును పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు
Salvaji Madhav Rao | కరీంనగర్ జైల్లో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి సల్వాజీ మాధవ్ రావును బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు.
హైదరాబాద్ : పోలీసులు అక్రమ కేసులు బనాయించి కరీంనగర్ జైల్లో( Karimnagar jail) పెట్టిన జగిత్యాల జిల్లా ధర్మారం మండలం బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి సల్వాజీ మాధవ్ రావును(Salvaji Madhav Rao) పెద్దపల్లి పార్లమెంటు ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwer), జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ పరామర్శించారు. పార్టీపరంగా, వ్యక్తిగతంగా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.
మాధవరావుపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకునేలా పోరాడుతామన్నారు. కాగా, మాధవరావు అధికార పార్టీని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నాయకులు కక్షగట్టి గత నెలలో తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పైగా లేని విషయాన్ని సృష్టించి, కాంగ్రెస్ యూత్ నాయకుడిని ఎస్సీ కులం పేరిట దూషించాడని అక్రమంగా కేసు నమోదు చేయించి జైల్లో పెట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

