తిరుమల : తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 21 నుంచి 23వ తేదీ వరకు మూడు రోజులపాటు పలు సేవలను టీటీడీ(TTD) రద్దు చేసింది. సాలకట్ల వసంతోత్సవాల(Salakatla Vasantotsavam) సందర్భంగా కల్యాణోత్సవం(Kalyanotsavam) , ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఏప్రిల్ 21న ఉదయం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు మాడవీధులలో ఊరేగి వసంత మండపంలో నిర్వహించే వసంతోత్సవ వేడుకల్లో పాల్గొంటారని వివరించారు.
రెండవ రోజు స్వామివారు బంగారు రథం అధిరోహణ, 23న మలయప్పస్వామివారితో పాటుగా సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొంటారని వెల్లడించారు. వసంతోత్సవంలో సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించటమే కాక వివిధ ఫలాలను కూడా నివేదించడం ప్రధాన ప్రక్రియని తెలిపారు.