BRS Party | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీలోకి చేరికల పరంపర కొనసాగుతున్నది. మహారాష్ట్రలోని పలు పార్టీలకు చెందిన చైతన్యవంతులైన మహిళా నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మహిళా నేతలందరికీ సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
మహిళా సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం వివిధ పథకాలు ప్రవేశపెట్టి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో సీఎం కేసీఆర్ సింహభాగం మహిళలకే కేటాయిస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళా సంక్షేమం, అభివృద్ధి అమలు అవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, అందుకు ప్రధాన కారణం బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దార్శనికతేనని వారు పేర్కొన్నారు.