తిరుమలాయపాలెం, ఏప్రిల్ 10 : ‘ఒక్కసారి వచ్చి మా ఇళ్లు చూడండి.. పేదోళ్లకు ఇళ్లు మంజూరు చేయండి..’ సారూ అంటూ రాముల ఆధ్వర్యంలో మహిళలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతులు పట్టుకొని బతిమిలాడారు. స్పందించిన మంత్రి.. దశలవారీగా అందరికీ ఇళ్లు ఇస్తాం. మీ ఇంట్లో భోజనం కూడా చేస్తా ం.. అంటూ మహిళలను బుజ్జగించారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో మంత్రి పొంగులేటి గురువారం భారీ పోలీసు బందోబస్తు మధ్య పర్యటించారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీలు, పథకాల అమలు తీరుపై ప్రజలు ప్రశ్నించకుండా ఎక్కడికక్కడ పోలీసులు జాగ్రత్తలు చేపట్టారు. సమస్యలపై ప్రశ్నించేందుకు యత్నించినవారిని అడ్డుకున్నారు. మేడిదపల్లిలో రావుల జగన్నాథరెడ్డి, మరికొందరు రైతులు రైతు రుణమాఫీ, రైతు భరోసాపై మంత్రిని నిలదీసేందుకు య త్నించగా.. వారిని పోలీసులు అదుపు చేశా రు. తిరుమలాయపాలెంలో తురక స్వామి అనే యువకుడు సమస్యలపై ప్రశ్నించే ప్రయత్నం చేయగా.. అతడిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మంత్రి పర్యటనలో ఎక్కడ చూసినా పోలీసుల హంగామా కనిపించింది.