Crime News | స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత రాజయ్య కారు ఢీ కొనడంతో శనివారం ఒక మహిళ మృతి చెందింది. ఈ ఘటన కాజీపేట మండలం మడికొండ వద్ద చోటు చేసుకున్నది. మృతురాలి పేరు కలకోట్ల స్వప్న (40)గా గుర్తించారు. ఈ ప్రమాదానికి పూర్తి కారణాలు తెలియరాలేదు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కారు ప్రమాదం జరిగినప్పుడు అందులో మాజీ ఎమ్మెల్యే రాజయ్య ప్రయాణిస్తున్నారా? లేదా? అన్న సంగతి తెలియాల్సి ఉంది. మరణించిన స్వప్న మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఇంకా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
Amazon Prime Day 2024 Sale-iPhone 13 | రూ.50 వేలలోపు ధరకే ఐఫోన్ 13.. ఇవీ డిటెయిల్స్..’
Hyundai Venue | వెన్యూ.. ఎక్స్టర్లపై హ్యుండాయ్ డిస్కౌంట్లు.. గరిష్టంగా రూ.55 వేలు..!
Suzuki Motor Cycles | ఫెస్టివ్ కలర్స్ తో సుజుకి యాక్సెస్.. బర్గ్మన్ స్ట్రీట్ స్కూటర్లు.. ధరలిలా..!