Selfie | నల్లగొండ జిల్లా వేములపల్లి సమీపంలో శుక్రవారం భర్త, తమ్ముడు, కూతురుతో కలిసి కారులో హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ మహిళ నాగార్జునసాగర్ ఎడమ కాల్వను చూసి ఆగింది. రైలింగ్ వద్ద సెల్ఫీ దిగుతుండగా పట్టుతప్పి కాల్వలో పడిపోయింది.
కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో పక్కనే ఉన్న గజలాపురం యువకులు జక్కా నాగయ్య, జక్కా నాగరాజు మహిళను కాపాడేందుకు కాల్వలో దూకారు. మరికొందరు పైనుంచి తాడు విసరడంతో ఆమెను క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. ఆ మహిళ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవడంతో వివరాలు తెలియరాలేదు. నాగయ్య, నాగరాజును స్థానికులు అభినందించారు.
ప్రభుత్వ దవాఖానలో పశువులు
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఇలాకా.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ ప్రభుత్వ దవాఖాన పశువులు, వీధి కుక్కలకు ఆవాసంగా మారింది. మహదేవ్పూర్ కమ్మూనిటీ హెల్త్ సెంటర్లో పరిసరాలు అధ్వానంగా ఉండటంతో దవాఖాన లోపలికి పట్టపగలే పశువులు చేరుతున్నాయి. – జయశంకర్ భూపాలపల్లి