Jagtial: రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో (Panchayathi Elections) సర్పంచ్‌గా, వార్డు మెంబర్‌గా ఓ మహిళ విజయం సాధించారు. జగిత్యాల (Jagtial) జిల్లా రాయికల్ మండలం ఉప్పుమడుగు సర్పంచ్‌గా (Sarpanch), ఆరో వార్డు సభ్యురాలిగా (Ward Member) కొత్తకొండ రోజా నవీన్ (Kothakonda Roja) పోటీచేశారు. ఆరో వార్డుకు నామినేషన్లు రాకపోవడంతో రోజా ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆమె ఏకగ్రీవమయ్యారు. మరోవైపు ఆదివారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో రోజా సర్పంచ్‌గానూ గెలుపొందారు. తన సమీప అభ్యర్థిపై 140 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. దీంతో అటు వార్డు మెంబర్‌గా, ఇటు సర్పంచిగా ఎన్నికై డబుల్ విక్టరీ సొంతం చేసుకున్నారు. అయితే ఆమె వార్డు మెంబర్ పదవికి రాజీనామా చేయనున్నారు.
మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్తా, మామలతో కోడళ్లు సవాల్ విసిరి విజయం సాధించారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం శ్రీరామ్‌నగర్ సర్పంచ్ స్థానం బీసీ జనరల్‌కు రిజర్వు అయింది. సర్పంచ్ స్థానానికి ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కొడుకు, కోడలు నామినేషన్ వేయగా, కొడుకు తాళ్లపెళ్లి శ్రీరామ్‌గౌడ్ విత్‌డ్రా చేసుకున్నారు. కోడలు తాళ్లపెళ్లి రాధిక మాత్రం ఉపసంహరించుకోలేదు. బరిలో మామ తాళ్లపల్లి సత్యనారాయణగౌడ్, కోడలు రాధిక నిలిచారు. ఆదివారం ఎన్నికల్లో మామపై రాధిక 14 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం గన్శ్యాందాస్నగర్ గ్రామ సర్పంచ్ స్థానానికి అత్తాకోడళ్లు పోటీపడ్డారు. అత్త సూర నర్సమ్మపై కోడలు సూర రమ 18 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. గ్రామంలో మొత్తం 1906 ఓట్లు పోలవగా, సూర రమకు 874, సూర నర్సమ్మకు 856 ఓట్లు పోలయ్యాయి.