జయశంకర్ భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar District) పలిమెల మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ ఎండ తీవ్రతకు(Sunburn) తట్టుకోలేక మృతి( Woman dies) చెందింది. ఎస్ఐ తమాషారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కుమ్మరి అనిత(45) వారం రోజుల నుంచి కూలీ పనులకు వెళ్లడంతో వడదెబ్బకు గురైంది. సోమవారం తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది. మృతురాలి అత్త చిన్నక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అనిత మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.