లక్ష్మీదేవిపల్లి, మే 25: వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేయడంతో ఓ మహిళ తీవ్ర గాయాలపాలై మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో సోమవారం చోటుచేసుకున్నది. వివరాల ప్రకారం.. చాతకొం డ పంచాయతీ పరిధిలోని ఎస్సీకాలనీకి చెందిన రాములమ్మ (40) పనుల నిమి త్తం బయటకు వెళ్లగా వీధికుక్కలు ఆమె పై దాడి చేశాయి.
రాములమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ప్రభుత్వ దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది.