నాంపల్లి కోర్టులు, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో బుధవారం నాంపల్లి కోర్టు మరికొందరు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయనున్నది. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్‌తోపాటు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్‌కుమార్ వాంగ్మూలాలను నమోదు చేసిన ప్రజాప్రతినిధుల కోర్టు.. ఇప్పుడు తుల ఉమ, బాల్క సుమన్, సత్యవతి రాథోడ్ వాంగ్మూలాలను రికార్డు చేయనున్నది. కాగా, సినీనటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో వివరణ ఇచ్చేందుకు మంత్రి కొండా సురేఖ బుధవారం కోర్టుకు హాజరుకావాల్సి ఉన్నది.