హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ మద్యం పాలసీ సీబీఐ కేసులో రౌస్ ఎవెన్యూ కోర్టు లో దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ను ఎమ్మెల్సీ కవిత ఉపసంహరించుకున్నారు. ఈ పిటిషన్పై బుధవారం విచారణ జరుగనుండగా.. కవిత తరఫు న్యాయవాదులు మంగళవారమే పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కోర్టును ఆశ్రయిస్తా మని న్యాయవాదులు తెలిపారు.