హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో మరో రెండు రోజులుపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కుమ్రంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, ఆదిలాబాద్, మహబూబాబాద్, నిర్మల్, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మలాజ్గిరి, జయశంకర్భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, జనగామలో అకడకడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేరొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.