హైదరాబాద్: అలవిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శనాస్త్రాలు సంధించారు. వంద రోజుల్లో ప్రతి గ్యారంటీని నెరవేరుస్తామంటూ హామీ ఇచ్చారని, 3 వందల రోజులైనా అవి అతీగతీలేవంటూ విరుచుకుపడ్డారు. ఒక్క కాంగ్రెస్ నాయకుడు గానీ కార్యకర్త గానీ ప్రజలకు సమాధానం చెప్తారా అంటూ ప్రశ్నించారు. హామీలు అమలు చేయనందుకు రాహుల్, ప్రియాంక గాంధీ ఢిల్లీ నుంచి వచ్చి క్షమాపణ చెప్తారా అంటూ ఎక్స్ వేదికగా నిలదీశారు.
‘అప్పుడు, 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ అని ఫుల్ పేజీ ప్రకటనలు, స్టాంపు పేపర్ల మీద అఫిడవిట్లు..
ఇప్పుడు, 300 రోజుల తర్వాత, ఒక్క కాంగ్రెస్ నాయకుడు గాని, కార్యకర్త గాని ప్రజలకు సమాధానం చెప్తారా?..
ఢిల్లీ నుంచి రాహుల్, ప్రియాంక వచ్చి క్షమాపణ చెప్తారా?’.. అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
అప్పుడు,
100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ అని ఫుల్ పేజీ ప్రకటనలు, స్టాంపు పేపర్ల మీద అఫిడవిట్లు
ఇప్పుడు,
300 రోజుల తర్వాత, ఒక్క కాంగ్రెస్ నాయకుడు గాని, కార్యకర్త గాని ప్రజలకు సమాధానం చెప్తారా ?
ఢిల్లీ నుండి రాహుల్, ప్రియాంక వచ్చి క్షమాపణ చెప్తారా ?… pic.twitter.com/eg4Z0S1Jmv
— KTR (@KTRBRS) September 30, 2024