Rammohan Naidu | తెలంగాణలో విమానయాన రంగానికి తోడ్పాటు అందిస్తా : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
Rammohan Naidu | తెలంగాణలో విమాన యాన రంగానికి తన వంతు కృషి చేస్తానని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.
అమరావతి : తెలంగాణ (Telangana)లో విమాన యాన రంగానికి తన వంతు కృషి చేస్తానని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి(Union Minister) రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu) తెలిపారు. ఏపీ, తెలంగాణలో విమానయాన రంగాన్ని పరుగులు పెట్టిస్తా్నని వెల్లడించారు. తెలంగాణలో ఉన్న తెలుగు ప్రజల మనసు గెలుచుకునేలా పనిచేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పేర్కొన్నారు.
పాలనలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలంటే 30 శాఖలు మన చేతిలో ఉండాలని, అయితే అది సాధ్యపడదని అన్నారు. కేంద్రంలోని అన్ని శాఖాలను సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతానని తెలిపారు.
భోగాపురం (Bogapuram) అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రికార్డు సమయంలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అదే విధంగా విమానయాన శాఖలో ఉన్న ఉద్యోగ అవకాశాలపై దృష్టిని సారిస్తామని వెల్లడించారు. గతంలో విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన జ్యోతిరాధిత్య సింధియాను కలిసి ఆయన అనుభవాలను తెలుసుకుంటానని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs | యూకో బ్యాంక్లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

