హైదరాబాద్: బీజేపీతో ఢిల్లీలో చిట్టి నాయుడి కాళ్ల బేరాలు, జైపూర్‌లో అదానీతో డిన్నర్ ఫలితం ఇచ్చినట్టుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. 30 సార్లు ఢిల్లీకి వెళ్లినా మూడు పైసలు తేలేదు కానీ, మూడు కేసులు పెట్టి శునకానందం పొందాలనుకుంటే మీ ఖర్మ అంటూ మండిపడ్డారు. కేసులను చట్టపరంగా ఎదుర్కొంటామని చెప్పారు. గుడ్‌లక్ చిట్టినాయుడు అండ్ కో అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
బీజేపీతో ఢిల్లీలో చిట్టి గారి కాళ్ళ బేరాలు, జైపూర్ లో అదానీతో డిన్నర్ రిజల్ట్ వచ్చినట్టుంది
30 సార్లు ఢిల్లీకి పోయిన 3 పైసలు తేలేదు కానీ, మూడు కేసులు పెట్టి శునకానందం పొందాలనుకుంటే, మీ ఖర్మ
Good luck Chitti Naidu & Co
Will face you legally. Bring it on 👍
— KTR (@KTRBRS) December 17, 2024
ప్రభుత్వ పాలనా లోపాలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతూ ప్రజల ముందు పెడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ప్రభుత్వం కుట్ర పన్నుతున్నది. ఎలాంటి త ప్పూ లేకున్నా నిందవేసేందుకు ఉత్సాహ పడుతున్నది. ముఖ్యంగా ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగినప్పుడల్లా, ప్రభుత్వానికి పెద్ద సమస్య వచ్చినప్పుడల్లా డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఈ-రేస్‌ను వాడుకుంటున్నది. తాజాగా ఈ-రేస్‌పై విచారణకు గవర్నర్ అనుమతి ఇ చ్చారని ప్రభుత్వం తెలిపింది.
అసలేం జరిగిందంటే?
మోటారు కార్లు, వాహనాలు వెదజల్లే కర్బ న ఉద్గారాలను తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించాలని, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం, వీటిపై చైతన్యం కలిగించడం, పర్యావరణాన్ని కాపాడాలన్న లక్ష్యం తో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో ఫా ర్ములా ఈ-రేస్ నిర్వహిస్తుంటారు. అంతర్జాతీయ సంస్థ ‘ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్’ (ఎఫ్ఐఏ) ఈ ఫార్ములా ఈ-రేస్‌లు నిర్వహిస్తుంటుంది. మన దేశంలో మొదటిసారిగా ఈ పోటీలు నిర్వహించే అవకాశం తెలంగాణకు దక్కించుకున్నది. తద్వారా , షాంఘై, బెర్లిన్, మొనాకో, లండన్ వంటి నగరాల సరసన హైదరాబాద్ నిలిచింది. నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ కసరత్తుతో హైదరాబాద్‌కు ఆ అవకాశం దక్కింది. 2023 ఫిబ్రవరి 5-11వ తేదీ మధ్య ఈ-రేస్ 9వ సీజన్ పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇచ్చింది. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమం యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
రేస్ కోసం హైదరాబాద్‌కు 31 వేల మంది
ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లోని కార్ల ప్రేమికులు ఈ-రేస్‌ను ప్రత్యక్ష ప్రసారాలు, వివిధ మాధ్యమాల ద్వారా వీక్షించారు. 31 వేల మంది రేస్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు హైదరాబాద్‌కు వచ్చారు. ఇదంతా అసెంబ్లీ ఎన్నికలకు ముందు జూన్ -జూలై మధ్య జరిగింది. అయితే, ఫిబ్రవరి నాటికి తాము స్పాన్సర్లను చూస్తామని, అప్పటివరకు హెచ్ఎండీఏ నుంచి రూ.50 కోట్లు నిర్వహణ కో సం కేటాయిస్తామని పురపాలక శాఖ మంత్రి హోదాలో కేటీఆర్ నిధులు విడుదల చేశారు. రేస్ నిర్వహణలో హెచ్ఎండీఏ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించింది. ఈ నిధులను రేస్ నిర్వహించే సంస్థ ఖాతాకే పంపించారు. అ యితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రా గానే ఫార్ములా ఈ-రేస్‌ను రద్దుచేసింది. దీం తో 2024 ఫిబ్రవరిలో జరగాల్సిన ఈ రేస్ ర ద్దయింది. రేస్ నిర్వహణ సంస్థ గతంలో హెచ్ఎండీఏ ఇచ్చిన నిధులను వెనకి ఇవ్వలేదు. రూ.50 కోట్ల నిధుల్లో నుంచి మంత్రి కేటీఆర్ కో, బీఆర్ఎస్కో రూపాయి కూడా వెళ్లలేదు.
బాజాప్తా ఒప్పుకున్న కేటీఆర్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఇబ్బంది పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. జన్వాడ ఫామ్‌హౌజ్ పేరుతో కొన్నాళ్లు, ఫోన్ ట్యాపింగ్ అంటూ కొన్నాళ్లు, కుటుంబ పార్టీలో డ్రగ్స్ అంటూ మరికొన్ని రోజులు బ ద్నాం చేసే ప్రయత్నం చేసింది. అయినా ఆధారాలు దొరకలేదు, జనం నమ్మలేదు. దీంతో ‘ఫార్ములా ఈ-రేస్ లో అవినీతి’ అంటూ కొత్త పాట అందుకున్నారు. ఈ కేసులో ఆయనను అరెస్టు చేస్తారంటూ కొన్ని నెలలుగా ప్రచారం చేస్తున్నది. అయితే ఈ అంశంలో కేటీఆర్ ఎప్పుడో స్పష్టత ఇచ్చారు. ‘రెండో విడత రేస్ నుంచి గ్రీన్ కో తప్పుకోవడంతో రేస్ నిర్వహణ ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ పెంచేందుకు ప్రభుత్వం తరఫున రూ.55 కోట్లు ఖర్చు చేశాం. ఇందులో అప్పటి హెచ్ఎండీఏ కార్యదర్శి అరవింద్ కుమార్ తప్పేమీ లేదు. ఫైల్‌పై నేనే సంతకం చేశా. రూ.55 కోట్లు చెల్లించమని నేనే చెప్పాను .కాబట్టి నాదే బాధ్యత. కేసు పెడతామంటే పెట్టుకోండి. రెండు నెలలు లోపల వేసి పైశాచిక ఆనందం పొందుతానంటే పొందండి. ఉడుత ఊపులకు బెదరం’ అని స్పష్టం చేశారు. ఏ విచారణకైనా సిద్ధమ ని, దేనికైనా రెడీగా ఉన్నానని చెప్పారు. ఇది పెద్ద కేసు కాదని, సాంకేతికంగా ఉన్న ఒక అంశాన్ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ నాటకం ఆడుతున్నదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఏం లాభం కలిగింది?
ఫార్ములా ఈ-రేస్ నిర్వహణతో రాష్ర్టానికి అనేక విధాలుగా మేలు కలిగిం ది. టోక్యో, షాంఘై, బెర్లిన్ , మొనాకో, లండన్ వంటి అంతర్జాతీయ నగరాల సరసన హైదరాబాద్ చేరింది. ఈ-రేస్ ప్రభావంపై నీల్సన్ స్పోర్ట్స్ అనాలసిస్ అధ్యయనం నిర్వహించింది. తెలంగాణ రాష్ర్టానికి సుమారు రూ.700 కోట్ల మేర ఆర్థిక లబ్ధి చేకూరినట్టు స్పష్టం చేసింది.