Wife Suicide Attempt | మహబూబాబాద్ : ఓ టీవీ సీరియల్ ఓ కుటుంబంలో చిచ్చుపెట్టింది. అది ఎంతలా అంటే చివరకు భార్యనే ఆత్మహత్యాయత్నం చేసుకునే వరకు దారి తీసింది. ఈ దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లాలో వెలుగు చూసింది.
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోడిపుంజుల తండాకు చెందిన ఓ వ్యక్తి ఉదయమే పొలం పనులకు వెళ్లాడు. ఇక పొలం నుంచి ఇంటికి వచ్చిన భర్తకు అన్నం పెట్టకుండా.. భార్య టీవీలో వస్తున్న ఓ సీరియల్లో లీనమైపోయింది. సీరియల్ అయిపోయాక అన్నం పెడుతానని భర్తకు అడ్డగోలుగా సమాధానం ఇచ్చింది.
దీంతో కోప్రోదిక్తుడైన భర్త.. సీరియల్ ముఖ్యమా, నేను ముఖ్యమా అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భార్య ఆత్మహత్యాయత్నం చేసింది. మొదట కుమారుడికి పురుగుల మందు తాగించి తర్వాత తాను తాగింది. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరిద్దరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.
కుటుంబంలో చిచ్చు పెట్టిన టీవీ సీరియల్
సీరియల్ ముఖ్యమా, నేను ముఖ్యమా అని భర్త కోప్పడినందుకు కొడుకుకు పురుగుల మందు తాగించి, తానూ తాగిన భార్య
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోడిపుంజుల తండాలో ఘటన
ఉదయం నుండి పొలం పనులు చేసి వచ్చిన భర్తకు అన్నం పెట్టకుండా, సీరియల్ అయిపోయాక… pic.twitter.com/orjc4kIv1s
— Telugu Scribe (@TeluguScribe) August 22, 2025