హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను ప్రయుడితో కలిసి హతమార్చింది. ఈ విషాదకర సంఘటన నారాయణఖేడ్ మండలం గంగాపూర్లో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఉన్నాయి. గ్రామానికి చెందిన ముత్యం రెడ్డి భార్య వివాహేతర సంబంధానికి అడ్డువస్తాడని భావించి ప్రియుడు చింటుతో కలిసి అంతమొందించాలని భావించింది.
అందులో భాగంగా ప్రియుడు, ఆమె కలిసి భర్తను చంపి జేసీబీతో గొయ్యి తీయించి మృతదేహాన్ని పూడ్చిపెట్టింది. అనంతరం భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో 9 రోజుల తర్వాత నేరాన్ని ఒప్పుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు.