Telangana | ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ టీచర్ హత్య కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. ప్రియుడి మోజులో పడిన భార్యనే సుఫారీ ఇచ్చి మరీ హత్య చేయించినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. భార్య కదలికలపై అనుమానం వచ్చి ఆమె సెల్‌ఫోన్‌ను చెక్ చేయగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త స్కూలుకు వెళ్లగానే ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని ఎంజాయ్ చేయడం, వాటిని ఫోన్లో ఫొటోలు తీసుకున్నట్లుగా కూడా గుర్తించారు. ఇప్పుడు ఆ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా కూడా మారాయి.
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం నాగులకొండకు చెందిన గజేందర్.. జైనథ్ మండలం కెనాల్ మేడిగూడలో గవర్నమెంట్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. భార్య విజయలక్ష్మితో కలిసి సంతోషంగా జీవిస్తున్నాడు. అయితే మహేశ్ అనే యువకుడితో విజయలక్ష్మీ అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త ఉద్యోగానికి వెళ్లిపోగానే ప్రియుడితో కలిసి షికార్లు చేసేది. అతనితో ఎంజాయ్ చేస్తూ.. వాటిని ఫొటోలు తీసి మధుర జ్ఞాపకాలుగా ఫోన్లోనే దాచి పెట్టుకుంది. అయితే కొద్దిరోజులుగా వేసవి సెలవులు ఉండటంతో వాళ్లిద్దరూ కలుసుకోవడానికి కుదరలేదు. దీంతో భర్త ఉంటే ఎప్పటికైనా తమకు అడ్డే అని భావించిన విజయలక్ష్మీ అతన్ని హత్య చేయాలని భావించింది. ప్రియుడితో కలిసి భర్త మర్డర్‌కు స్కెచ్ వేసింది. ఒక సుపారీ గ్యాంగ్‌ను కూడా సంప్రదించి.. తన భర్త గురించి పూర్తి వివరాలను వెల్లడించింది. స్కూల్ రీఓపెన్ రోజున ప్లాన్ చేసి గజేందర్‌ను చంపేశారు. ఆ తర్వాత ఏం తెలియనట్టుగా విజయలక్ష్మీ తన భర్త కనిపించడం లేదని గజేందర్ భార్య విజయలక్ష్మీ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది.
విజయలక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇంతలో గాదేగూడ మండలం పర్సువాడ వద్ద జూన్ 12వ తేదీన ఒక మృతదేహం అనుమానాస్పద రీతిలో కనిపించింది. దీంతో గజేందర్‌ను ఎవరు హత్య చేసి ఉంటారని పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో విచారణ చేస్తున్న పోలీసులకు భార్య విజయలక్ష్మీ కదలికలపై అనుమానం వ్యక్తమైంది. దీంతో ఆమె సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని కాల్ డేటాను పరిశీలించారు. ఆ ఫోన్లో ఉన్న ఫొటోలను కూడా చూసి షాకయ్యారు. ప్రియుడి కోసమే భర్తను హత్య చేయించిందని పోలీసులు నిర్ధారించారు. ప్రియుడు మహేశ్‌తో పాటు విజయలక్ష్మీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.