Blood Test | జూలపల్లి, మార్చి 22 : తన భర్త రక్త పరీక్షలు చేయించుకోవడంలేదని మనస్తాపం చెందిన ఓ భార్య పురుగుల మందు తాగి, ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం తేలుకుంటలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా .. గ్రామానికి చెందిన మేకల పద్మ (48) భర్త తిరుపతి బతుకు దెరువు కోసం 13 ఏండ్ల క్రితం మలేషియా వెళ్లి తిరిగి స్వగ్రామానికి వచ్చి, నెల రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు.
పెద్దపల్లిలోని ప్రభుత్వ దవాఖానలో చికిత్స తీసుకున్నా జ్వరం తగ్గక పోవడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానకు వెళ్లగా క్షయ వ్యాధి ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో మరికొన్ని రక్త పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించగా నిరాకరించాడు. ఎంత చెప్పినా రక్త పరీక్షలు చేయించుకోకపోవడంతో మనస్తాపం చెందిన పద్మ పురుగుల మందు తాగి, ఇంట్లో దూలానికి చీరతో ఉరేసుకుకుంది. భర్త తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సనత్‌కుమార్ వివరించారు