నర్సంపేట: బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఖర్చుల కోసం ఓ వితంతువు తన నెల పింఛన్‌ను విరాళంగా ఇచ్చి పెద్ద మనసు చాటింది. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం చంద్రయ్యపల్లికి చెందిన బయ్య నీలమ్మ సోమవారం తన కొడుకు నవీన్‌తో కలిసి వచ్చి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి రూ. 2 వేలు అందజేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన నీలమ్మ కేసీఆర్‌కు కృతజ్ఞతగా తన ఒక నెల ఫించన్ సొమ్మును విరాళంగా ఇవ్వడం గర్వంగా ఉందన్నారు. నీలమ్మ మాట్లాడుతూ తెలంగాణ రాకముందు పింఛన్ రూ. 200 వచ్చేదని, కేసీఆర్ రూ. 2 వేలకు పెంచిండని చెప్పారు.