హైదరాబాద్: తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి ఇంట్లో ఈడీ దాడులు జరిగి రెండు నెలలైనా ఎలాంటి సమాచారం లేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. ఆ దాడుల గురించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. దాడులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, కనీసం ఈడీ అధికారుల స్టేట్మెంట్లు కూడా ఇప్పటికీ బయటకు రాలేదన్నారు. ఆ రోజు నోట్ల లెక్కింపు కోసం వాడిన రెండు కౌంటింగ్ మెషిన్లు ఏమయ్యాయని నిలదీశారు. ఆ దాడులపై ఎందుకు ఈ నిశ్శబ్దం అంటూ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఈ ఏడాది సెప్టెంబర్ 27న హైదరాబాద్‌లోని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంతోపాటు ఆఫీసుల్లో ఈడీ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.
విదేశీ మారక నిల్వల వ్యవహారంలో మిసెస్ జెడ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన కార్యాలయల్లో ఈ నెల 22న ఈడీ దాడులు నిర్వహించింది. ఒడిశా, ఢిల్లీ, గురుగ్రామ్‌తోపాటు 9 చోట్ల ఏకకాలంలో అధికారులు సోదాలు చేశారు. ఈ క్రమంలో రూ.1.39 కోట్లు, రహస్య పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సోమవారం ఈడీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి ఇంట్లో ఐటీ దాడులు జరిగి 2 నెలలైనా ఇప్పటికీ ఎలాంటి సమాచారం లేకపోవడంపై కేటీఆర్ ప్రశ్నించారు.
Any updates on the status of raids conducted in Hyderabad about 60 days ago on Telangana Revenue Minister’s house & offices?
No pictures or videos or statements yet? What happened to the 2 currency counting machines that went in?
Why the deafening silence? https://t.co/gdSStgXTcH
— KTR (@KTRBRS) November 26, 2024