KTR | రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ.. బీఆర్ఎస్ అంటే సీఎం రేవంత్‌కు వణుకెందుకు?: కేటీఆర్
ఇందిరమ్మ రాజ్యం పేరిట రాష్ట్రంలో ఆనాటి ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రకటనలో విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎకడికకడ అక్రమ అరెస్ట్‌లు, గృహ నిర్బంధాలు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
- గూండాలను వదిలి మా నేతలను అరెస్టు చేస్తరా?
- పార్టీ నేతలను బేషరతుగా విడిచిపెట్టాలి
KTR | హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : ఇందిరమ్మ రాజ్యం పేరిట రాష్ట్రంలో ఆనాటి ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రకటనలో విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎకడికకడ అక్రమ అరెస్ట్‌లు, గృహ నిర్బంధాలు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలను గురువారం అర్ధరాత్రి వరకు అక్రమ అరెస్టులు చేసి, శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా హౌస్ అరెస్టులు చేస్తారా? అని మండిపడ్డారు. ప్రజాపాలనలో ప్రతిపక్షాలు మీటింగ్ పెట్టుకోవడానికి కూడా అనుమతి లేదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ సమావేశం పెట్టుకుంటే ముఖ్యమంత్రికి వెన్నులో వణుకెందుకని ప్రశ్నించారు. మా పార్టీ నేతలంటే సరారుకు ఎందుకింత భయమో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలను గృహనిర్బంధం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా ముందస్తు అరెస్టులు చేసిన తమ పార్టీ నేతలను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
గాంధీ అనుచర గూండాలను అరెస్టు చేయాలి
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడిచేసిన అరికెపూడి గాంధీ అనుచరులైన కాంగ్రెస్ గూండాలను వెంటనే అరెస్ట్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిని వదిలేసి బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయడం ప్రభుత్వ దిగజారుడు విధానాలకు నిదర్శనమని పేర్కొన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, బీఆర్ఎస్ నేతలపై ప్రభుత్వం జులుం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని తేల్చిచెప్పారు. ప్రశ్నించిన ప్రజాప్రతినిధులపై దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణలో గతంలో ఎప్పుడూలేని విధంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడులకు దిగే సంసృతిని తీసుకొచ్చారని మండిపడ్డారు. తెలంగాణ ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా ప్రవర్తిస్తామంటే బీఆర్ఎస్ పార్టీ సహించబోదని స్పష్టం చేశారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరును, ఇతర అన్నివిషయాలను ప్రజలు గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి బుద్ధిచెప్తారని తెలిపారు.
బీఆర్ఎస్ యోధులకు వందనాలు
రౌడీ మూకలు దాడి చేసినా, రాళ్లు రువ్వినా, దాడులను ఆపాల్సిన పోలీసులు చేతులు ముడుచుకున్నా.. ధైర్యంగా నిలబడి పోరాడిన ప్రతీ ఒక్క గులాబీ సైనికుడికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అండగా నిలిచిన ప్రతీ సోదరుడికి, సోదరికి, అలాగే సోషల్ మీడియాలో అండగా నిలిచిన యోధులకు వందనాలు అని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

