గతంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ఉన్నారు. హౌసింగ్ స్కామ్‌లో ఆయన ఉన్నట్టు వార్తలు రావడంతో నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే రాజీనామా చేయాలని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు అప్పట్లో డిమాండ్ చేశారు. ఇవాళ మేము అడుగుతున్నది కూడా ఇదే. నిజాయితీ, నైతికత ఉంటే వెంటనే రేవంత్‌రెడ్డి స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి పదవినుంచి తప్పుకోవాలి.
-కేటీఆర్
KTR |హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): నేషనల్ హెరాల్డ్ కేసు చార్జిషీట్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరు ఉండటం తెలంగాణకే అవమానకరమని, వెంటనే సీఎం పదవికి ఆయన రాజీనామా చేయాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. గతంలో కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప హౌసింగ్ స్కామ్‌లో ఉన్నట్టు వార్తలు రావడంతో నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే రాజీనామా చేయాలని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అప్పట్లో డిమాండ్ చేశారని గుర్తుచేశారు. నిజాయితీ, నైతికత ఉంటే రేవంత్‌రెడ్డి స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని, లేదంటే కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనను ఆ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో డీకే శివకుమార్‌ను అకడి బీజేపీ నేతలు విమర్శిస్తుంటే, తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం రేవంత్‌రెడ్డిని పల్లెత్తు మాట అనకపోవడం ఆ రెండు పార్టీల మధ్య ఉన్న అపురూప సంబంధానికి నిదర్శనమని మండిపడ్డారు. విచ్చలవిడిగా సామ్‌లు చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మోదీ ప్రభుత్వం ఎందుకు కాపాడుతున్నదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణభవన్‌లో శనివారం మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, డాక్టర్ సంజయ్, కాలేరు వెంకటేశ్, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, పార్టీ నేత రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. యంగ్ ఇండియన్, నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరును చార్జిషీట్లో ఈడీ చేర్చడం తెలంగాణ రాష్ట్రానికి అవమానకరమని కేటీఆర్ ఫైరయ్యారు.
గతంలో ఎన్నో తప్పులు చేసిన రేవంత్‌రెడ్డికి ఇప్పటికీ బుద్ధి రాలేదని కేటీఆర్ విమర్శించారు. ‘2015 ఓటుకు నోటు కేసు చూశాం. నోట్ల కట్టలతో రేవంత్‌రెడ్డి పట్టుబడ్డారు. ఆ తర్వాత నుంచీ రేవంత్‌రెడ్డిని ‘బ్యాగ్‌మాన్’ అని పిలుస్తున్నారు. నాటిది ఓటుకు నోటు కేసు.. నేటిది సీటుకు రూట్ కుంభకోణం. రూ.50 కోట్లు పెట్టి రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవిని కొనుకున్నాడని నాటి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీడియా ముందటనే చెప్పిండు. ఆనాడు కోమటిరెడ్డి చేసిన ఆరోపణలకు ఆరోజు ఆధారాలు లేకపోవచ్చు కానీ ఇప్పుడు చార్జిషీట్‌తో ఈడీ ఆధారాలు చూపించింది. ఎవరు డబ్బులు ఇచ్చారు? ఏ పొజిషన్ని అమ్ముకున్నారు? ఎన్ని డబ్బులు ఇచ్చారు? అనే వివరాలను ఈడీ తన చార్జిషీట్లో స్పష్టంగా బయటపెట్టింది. నాడు కాంగ్రెస్ నేతలు చెప్పిన మాట నేడు నిజమవుతున్నది. తెలంగాణ అనేది కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మారింది. ఢిల్లీ కాంగ్రెస్‌కు ఎప్పుడు డబ్బులు కావాలంటే అప్పుడు భారీ మొత్తంలో అందిస్తూ రేవంత్‌రెడ్డి తన పదవిని కాపాడుకుంటున్నారు. ఓటుకు నోటు జరిగినప్పుడు రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యే. కానీ, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి. యావద్దేశం ముందు తెలంగాణ పరువు తీశారు. తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఇట్లాంటి వ్యక్తా? అనే పరిస్థితి కనిపిస్తున్నది’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
17 నెలల్లోనే 44 సార్లు ఢిల్లీకి పోయిన సీఎం రేవంత్‌రెడ్డి అరుదైన రికార్డు సృష్టించారు. ఢిల్లీకి ఎందుకు పోతున్నారో ఇప్పుడు మాకు అర్థమైంది. చీకట్లో అమిత్‌షా కాళ్లు పట్టుకోవడం, ఈడీ కేసుల నుంచి తప్పించాలని వేడుకొనేందుకే వెళ్తున్నారు.
-కేటీఆర్
‘గతంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ఉన్నారు. హౌసింగ్ సామ్లో ఆయన ఉన్నట్టు వార్తలు వస్తే నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే రాజీనామా చేయాలని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు అప్పట్లో డిమాండ్ చేశారు. ఇవాళ మేము అడుగుతున్నదని కూడా ఇదే. నిజాయితీ, నైతికత ఉంటే వెంటనే రేవంత్‌రెడ్డి స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలి. లేదంటే కాంగ్రెస్ అగ్ర నాయకత్వం స్పందించి ఆయనను ఆ పదవి నుంచి తప్పించాలి. నిష్పక్షపాతంగా విచారణ జరగడానికి సహకరించాలి. రేవంత్‌రెడ్డి మాటల ముఖ్యమంత్రి కాదు.. మూటల ముఖ్యమంత్రి అని తేలిపోయింది. మూటలు ఇచ్చే పీసీసీ పదవి పొందారని వెంకట్‌రెడ్డి చెప్పిండు. మూటలు పంపుతూ ముఖ్యమంత్రి పదవిని కాపాడుకుంటున్నారని ఇప్పుడు దేశమంతా తెలిసింది. ఆఫీస్ బేరర్ల నుంచి మూటలు తీసుకొని ఆనాడు కాంగ్రెస్ పత్రికకు నిధులు అందించారని ఈడీ చెప్పింది’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
‘17 నెలల్లోనే 44 సార్లు ఢిల్లీకి పోయిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అరుదైన రికార్డు సృష్టించారు. ఢిల్లీకి ఎందుకు పోతున్నారో ఇప్పుడు మాకు అర్ధమైంది. చీకట్లో బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకోవడానికి వెళ్తున్నారు. అమిత్‌షా కాళ్లు పట్టుకోవడం, ఈడీ కేసుల నుంచి తప్పించాలని వేడుకోవడం.. బయటికి వచ్చి పెద్ద పెద్ద పోజులు కొట్టడం. రేవంత్‌రెడ్డి 44 సార్లు ఢిల్లీకి పోయి చేసింది ఇదే. ప్రజలు కూడా అర్థం అయి ఉండాలి. ఒక ఇటుక పేర్చకుండానే, ఒక కొత్త ప్రాజెక్టు కట్టకుండానే, ఒక సంక్షేమ పథకాన్ని అమలు చేయకుండానే, ఒక హామీని అమలు చేయకుండానే లక్షా 80 వేల కోట్ల అప్పు చేసిండు. ఈ డబ్బులు ఎకడికి పోతున్నాయో ఇప్పుడైనా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఏడాదిన్నర కాలంగా తెలంగాణ ప్రజల సంపదను దోచి, తెలంగాణను ఏటీఎంలా మార్చి, ఢిల్లీ బాసులకు రేవంత్‌రెడ్డి దోచిపెడుతున్నారు. రాహుల్‌గాంధీ అఫీషియల్ బాస్ అయితే నరేంద్ర మోదీ, అమిత్‌షాలు రేవంత్‌రెడ్డికి అనఫీషియల్ బాస్‌లు. వారిని ప్రసన్నం చేసుకోవడానికి ఎక్కే విమానం.. దిగే విమానం అన్నట్టుగా తయారైంది’ అని కేటీఆర్ మండిపడ్డారు.
మీడియా ఎంత తాపత్రయపడ్డా, ఎన్ని ప్రకటనలు తీసుకున్నా రేవంత్‌రెడ్డి ఒక లొట్ట పీసు ముఖ్యమంత్రి అని ప్రజలకు అర్థమైపోయింది. మీడియా ఎన్ని దాచినా సోషల్ మీడియాతో ప్రజలకు వాస్తవాలు తెలుస్తూనే ఉంటాయి.
-కేటీఆర్
ఏడాదిన్నర కాలంగా సీఎం రేవంత్‌రెడ్డి మూడు పనులు మాత్రం చేశారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘బీఆర్ఎస్పై నిందలు.. బిల్డర్లు-కాంట్రాక్టర్లతో దందాలు.. ఢిల్లీ బాస్‌లకు వేలకోట్ల చందాలు. సంవత్సర కాలం నుంచి రేవంత్‌రెడ్డి చేస్తున్నది ఇదే. ఇది నిజంగా సిగ్గుచేటు. ఓటుకు నోటు కేసులో దొరికిన తర్వాత బుద్ధి వచ్చిందనుకున్నాం. కానీ, కుక్క తోక వంకర అన్నట్టు ఇప్పటికీ అవే అపసవ్యపు పనులు. అపసవ్యపు కార్యక్రమాలు చేసి తెలంగాణ పరువును తీసినందుకు తక్షణమే ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలి’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
దేశంలోని అన్ని విషయాలపై స్పందించే రాహుల్‌గాంధీ తన పార్టీకి చెందిన ముఖ్యమంత్రి పేరును ఈడీ ఛార్జిషీట్లో పేర్కొంటే ఎందుకు స్పందించడం లేదని కేటీఆర్ నిలదీశారు. ‘దేశంలోని అన్ని విషయాలపై రాహుల్‌గాంధీ మాట్లాడతారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ గురించి మాట్లాడుతరు. మరి తన పార్టీ ముఖ్యమంత్రి చేస్తున్న ఈ అవినీతిపై ఎందుకు మాట్లాడటం లేదు. ఏ-1గా సోనియాగాంధీ, ఏ-2గా రాహుల్‌గాంధీ పేర్లను ఈడీ ఛార్జిషీట్లో చేర్చినప్పుడు దేశంలోని ప్రతి కాంగ్రెస్ నాయకుడు స్పందించారు. కానీ, రేవంత్‌రెడ్డి నోరు విప్పలేదు. రేవంత్‌రెడ్డి మాత్రం జపాన్ పర్యటన పేరుతో తప్పించుకొని ఇప్పటిదాకా ఆ విషయంపై మాట్లాడటం లేదు. తన పేరును కూడా చార్జిషీట్లో ఈడీ చేరుస్తుందన్న సమాచారం ఉండటంతోనే రేవంత్‌రెడ్డి మాట్లాడటం లేదు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్. దాని డీఎన్ఏలోనే కరప్షన్ ఉన్నది’ అని కేటీఆర్ విమర్శించారు.
రేవంత్‌రెడ్డికి పిల్లనిచ్చిన మామ కాళేశ్వరంలో అవినీతి ఎకడిదని మీడియా ముందు ప్రశ్నిస్తున్నారు. మొత్తం ప్రాజెక్టుకు రూ. 94 వేల కోట్లు ఖర్చు అయితే అందులో రూ. లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఎలా అంటారు? ఇదంతా అబద్ధమని రేవంత్‌రెడ్డికి పిల్లనిచ్చిన మామే చెప్తున్నారు.
-కేటీఆర్
పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు జరిపి దాదాపు సంవత్సరం అవుతున్నది. కానీ, ఇప్పటిదాకా అటు ఈడీ వైపు నుంచి కానీ ఇటు పొంగులేటి వైపు నుంచి కానీ ఒక ప్రకటన కూడా రాలేదు. కాంగ్రెస్ మంత్రులపై చర్యలు తీసుకోవడానికి ఈడీకి, అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఎందుకు మొహమాటం? కాంగ్రెస్ మంత్రులను మోదీ ఎందుకు కాపాడుతున్నారు? పొంగులేటి ఇంట్లో డబ్బులు లెకబెట్టడానికి కౌంటింగ్ మిషన్లను కూడా తీసుకపోతున్న విజువల్స్ మీడియాలో వచ్చాయి. ఇప్పటిదాకా ఈ విషయంలో బీజేపీ స్పందించలేదు. తొమ్మిది నెలలైనా ఇరువర్గాల నుంచి ఎలాంటి స్పందన లేదు. రూ. 187 కోట్ల వాల్మీకి సామ్లో కర్ణాటకలో అరెస్టులు జరిగాయి. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అందులో రూ. 45 కోట్లు తెలంగాణకు బదిలీ అయ్యాయి. ఆ రూ. 45 కోట్లు అందుకున్న కాంగ్రెస్ నాయకుల పేర్లు ఇప్పటిదాకా బయటికి రాలేదు. వాళ్లను విచారించాలని ఇప్పటిదాకా ఈడీ అనుకోలేదు. రూ. 45 కోట్లు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు చేరాయని రిమాండ్ డైరీలో ఈడీ రాసింది. ఆ డబ్బులను లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి వాడారని ఆధారాలతో సహా స్పష్టం చేసింది. కాంగ్రెస్, బీజేపీ కుమ్మకుతో వాల్మీకి సాం కూడా బ్రహ్మ రహస్యంగానే మిగిలిపోయింది’ అని కేటీఆర్ విమర్శించారు.
‘పాలమూరు రంగారెడ్డి పథకంలో ఎలాంటి అవినీతి జరగలేదని, సీబీఐ దర్యాప్తు అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పు చెప్పిందని కేటీఆర్ గుర్తుచేశారు. మరోవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులే 30 శాతం కమిషన్ ఇవ్వండి.. లేదంటే ఏ పని జరగదని బహిరంగంగానే చెప్తున్నారు. మంత్రులు పైసలు తీసుకొని పనులు చేస్తారని లేకపోతే ఫైల్స్ కదలవని క్యాబినెట్ సహచరులు మీడియా ముందు బయట పెడుతున్నారు. రేవంత్‌రెడ్డికి పిల్లనిచ్చిన మామ కాళేశ్వరంలో అవినీతి ఎకడిదని మీడియా ముందు ప్రశ్నిస్తున్నారు. మొత్తం ప్రాజెక్టుకు రూ. 94 వేల కోట్లు ఖర్చు అయితే అందులో రూ. లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఎలా అంటారు? ఇదంతా అబద్ధమని రేవంత్‌రెడ్డికి పిల్లనిచ్చిన మామే చెప్తున్నారు. అందుకే, రేవంత్‌రెడ్డి ప్రస్టేషన్లో ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు’ అని కేటీఆర్ అన్నారు.
2015 ఓటుకు నోటు కేసు చూశాం. నోట్ల కట్టలతో రేవంత్‌రెడ్డి పట్టుబడ్డారు. ఆ తర్వాత నుంచీ రేవంత్‌రెడ్డిని ‘బ్యాగ్‌మాన్’ అని పిలుస్తున్నారు. నాటిది ఓటుకు నోటు కేసు.. నేటిది సీటుకు రూట్ కుంభకోణం.
-కేటీఆర్
ఫ్రస్ట్రేషన్లో రేవంత్‌రెడ్డి ఏదేదో చేస్తుంటారని, లీకులు ఇస్తుంటారని కేటీఆర్ విమర్శించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు వచ్చిందన్న వార్తను కొన్ని పత్రికలు అసలు రాయనే లేదని విమర్శించారు. ‘మీడియా ఎంత తాపత్రయపడ్డా, ఎన్ని ప్రకటనలు తీసుకున్నా రేవంత్‌రెడ్డి ఒక లొట్ట పీసు ముఖ్యమంత్రి అని ప్రజలకు అర్థమైపోయింది. మీడియా ఎన్ని దాచినా సోషల్ మీడియాతో ప్రజలకు వాస్తవాలు తెలుస్తూనే ఉంటాయి’ అని కేటీఆర్ తెలిపారు.
2024 మే 11న తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతున్నదని రాహుల్- రేవంత్‌రెడ్డి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారని కేటీఆర్ గుర్తుచేశారు. ఈ విషయంలో ఇప్పటిదాకా ఒక అడుగు కూడా ముందుకు పడలేదని విమర్శించారు. ‘సివిల్ సపె్లై సామ్లో జరిగిన కుంభకోణాన్ని మేం ఆధారాలతో సహా బయటపెట్టాం. ఈ సామ్లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్పందించదు. కేంద్ర ప్రభుత్వం స్పందించదు. కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా విచారణ జరపడానికి ముందుకు రావడం లేదు. అనేక స్కాములు వెలుగుచూస్తున్నాయి. రేవంత్‌రెడ్డి బావమరిది సృజన్‌రెడ్డికి చెందిన శోధా కన్స్ట్రక్షన్ కంపెనీకి ఎలాంటి అర్హతలు లేకపోయినా రూ. 1,137 కోట్ల విలువైన అమృత్ టెండర్లను అక్రమంగా కేటాయించారని మేం స్వయంగా కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ కట్టర్‌ను కలిసి ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే, ఇప్పటిదాకా కనీసం ఒక మాట కూడా కేంద్ర ప్రభుత్వం మాట్లాడటం లేదు. బీజేపీకి నిజాయితీ ఉంటే కచ్చితంగా మాట్లాడాలి. ఈ కుంభకోణాల వెనుక ఉన్న రహస్యాలను ఛేదించాలి’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
రేవంత్‌రెడ్డికి రాహుల్‌గాంధీ అఫీషియల్ బాస్ అయితే నరేంద్ర మోదీ, అమిత్‌షాలు అనఫీషియల్ బాస్‌లు. వారిని ప్రసన్నం చేసుకోవడానికి ఎక్కే విమానం.. దిగే విమానం అన్నట్టుగా తయారైంది రేవంత్ పరిస్థితి.
-కేటీఆర్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగిందని సెంట్రల్ ఎంపవర్ కమిటీ స్పష్టంగా నివేదిక ఇచ్చి చర్యలు తీసుకోవాలని సూచించినా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని కేటీఆర్ మండిపడ్డారు. ‘ప్రతిపక్ష నేతలపై మెరుపు వేగంతో స్పందించే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇకడ కాంగ్రెస్ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎవరు ఎవరితో కుమ్మకవుతున్నారో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. అమృత్ కుంభకోణంలో రేవంత్‌రెడ్డి బామ్మర్దిని కాపాడుతున్నది కేంద్ర ప్రభుత్వం. ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో బిల్డర్ల దగ్గర గజానికి రూ. 200 వసూలు చేస్తున్నా ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ఒక మాట కూడా మాట్లాడటం లేదు. సివిల్ సపె్లై సామ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతున్నది కేంద్రంలోని మోదీ ప్రభుత్వమే. సెంట్రల్ ఎంపవర్ కమిటీ రికమండేషన్ ఇచ్చిన తర్వాత కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉలుకు పలుకు లేకుండా ఉన్నది. ఇప్పుడు ఈ నేషనల్ హెరాల్డ్ కేసులోనైనా కేంద్రం స్పందిస్తుందో లేదో వేచి చూస్తాం. ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేయాలని గవర్నర్‌ను కలిసి కోరుతాం. ఇన్ని రోజుల నుంచి రక్షణ కవచంలాగా రేవంత్‌రెడ్డిని కాపాడుతున్న బీజేపీ ఇప్పటికైనా స్పందించకపోతే, నెల రోజుల తర్వాత కార్యాచరణను ప్రకటిస్తాం. ముఖ్యమంత్రిని కవచకుండలాల మాదిరిగా కాపాడుతున్న బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజల ముందు ఎండగడతాం’ అని హెచ్చరించారు.
దేశంలోని అన్ని విషయాలపై రాహుల్‌గాంధీ మాట్లాడతారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ గురించి కూడా మాట్లాడుతరు. మరి తన పార్టీ ముఖ్యమంత్రి పేరును ఈడీ ఛార్జిషీట్లో పేర్కొంటే ఎందుకు స్పందించడం లేదు.
-కేటీఆర్