హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు మాత్రమే రైతుభరోసా నిధులు జమ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అందులో లక్ష మందికిపైగా కోత పెట్టిందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరం వరకు ఉన్న రైతుల సంఖ్యను 22,55,181గా గుర్తించి రైతుబంధు అందించిందని, కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం 21,45,330 మందినే గుర్తించిందని, ఈ లెక్కన 1,09,851 మందికి కోత విధించిందని తెలిపారు. లక్షపైగా రైతులకు ఎందుకు రైతుభరోసా లేకుండా చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారుల జాబితాలో కోత విధించిన లక్ష మందితోపాటు మిగతా రైతులందరికీ వెంటనే రైతుభరోసా అందించాలని కోరారు.