హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : కనీసం వార్డు మెంబర్గా కూడా గెలువని తిరుపతిరెడ్డి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ఏ హోదాతో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. తిరుపతిరెడ్డి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేస్తున్న ఫొటోలను జత చేసి సోమవారం ఎక్స్ వేదికగా ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. వార్డు మెంబర్గా కూడా గెలువని వ్యక్తికి సీఎం స్థాయి అధికారాలు ఉన్నాయంటే అది ఎనుముల రాచరిక పాలనలోనే సాధ్యమవుతున్నదని వ్యాఖ్యానించారు
ఆరు గ్యారెంటీలు అమలైందే లేదు కానీ లెక్కకుమించిన అప్పులు దేనికో సం చేశారని కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించారు. ‘పిడికెడు మన్ను తీసింది లేదు.. కొత్తగా కట్టిందేమీ లేదు.. రుణమాఫీ పూర్తి చేయలేదు.. రైతు భరోసా ఇయ్యనేలేదు. 2 వేల పింఛను 4 వేలు కాలేదు. ఆడబిడ్డలకు 2500 ఇవ్వలేదు. తులం బంగారానికి దికేలేదు. కేసీఆర్ కిట్టు లేదు. న్యూట్రిషన్ కిట్ రాలేదు. లక్షన్నర కోట్లు తెచ్చి ఎవరి పాలు చేశారు?’ అని ప్రశ్నించారు. పదేండ్లలో కేసీఆర్ చేసిన అభివృద్ధికి 4 లక్షల కోట్ల అప్పు చేస్తే విషప్రచారం చేస్తున్నారంటూ కేటీఆర్ కవితాత్మకంగా రేవంత్సర్కార్పై సెటైరికల్ ట్వీట్ చేశారు.
కాళేశ్వరం కట్టి, పాలమూరు రంగారెడ్డి కట్టి, సీతారామసాగర్ కట్టి.. వందల టీఎంసీల రిజర్వాయర్లు నిర్మించి.. మిష న్ కాకతీయ కింద చెరువులు, కుంటలు బాగుచేసి, మిషన్ భగీరథ కింద ఇంటింటికి మంచినీళ్లిచ్చి, రైతుబంధు ఇచ్చి, రైతుబీమా ఇచ్చి, కల్యాణలక్ష్మి ఇచ్చి, ఆసరా పింఛన్లతో అండగా నిలిచి, వెయ్యికిపైగా సంక్షేమ గురుకుల పాఠశాలలను ఏర్పాటుచేసి, పల్లెప్రగతి, పట్టణప్రగతి, హరితహారంతో పచ్చదనం పెంచి, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి, అన్ని రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టి, దశదిశలా తెలంగాణ వైభవాన్ని చాటి, పదేండ్లలో 4 లక్షల కోట్ల అప్పు చేసిన కేసీఆర్ ప్రభుత్వం మీద విషప్రచారం చేసిన సన్నాసులు, కేవలం ఏడాది పాలనలో.. లక్షన్నర కోట్ల అప్పు ఎందుకు చేశారో..