హైదరాబాదర్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): రైతులందరికీ రూ. 15 వేల ఆర్థిక సాయాన్ని అందిస్తామన్న కాంగ్రెస్ పార్టీ కౌలు రైతులను ఏవిధంగా గుర్తిస్తుందని సినీహిరో, రచయిత రాజభీమ్రెడ్డి ప్రశ్నించారు. ఓ వెబ్ చానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. రైతుభరోసా ద్వారా రైతులకు రూ.15 వేలు ఇస్తామన్న హామీని ఇప్పటివరకు అమలు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.
కౌలు రైతులకు మాత్రమే రైతుభరోసా ఇవ్వాలని రేవంత్రెడ్డి సర్కారు యోచిస్తున్నదని, అయి తే క్షేత్రస్థాయిలో భూమి యజమానులెవరూ కౌలు రైతులతో ఒప్పందం చేసుకోరని ఆయన స్పష్టం చేశారు.