కంఠేశ్వర్, జనవరి 30: మున్సిపల్ ఎన్నికలేమో కానీ బల్దియాకు కాసుల వర్షం కురుస్తున్నది. పోటీచేసే అభ్యర్థులు కచ్చితంగా మున్సిపాలిటీ నుంచి ‘నో డ్యూస్’ సర్టిఫికెట్ నామినేషన్ పత్రాలతోపాటు సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పుడిదే బల్దియాకు భారీగా ఆదాయం తెచ్చిపెడుతున్నది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రముఖ హోటల్ యజమాని కార్పొరేటర్‌గా పోటీ చేయడానికి అంతా సిద్ధం చేసుకున్నారు.
ఆయన కొన్నేండ్లుగా హోటల్‌కు సంబంధించిన పన్ను చెల్లించడం లేదు. మున్సిపల్ కార్పొరేషన్‌కు వెళ్లగా, బకాయిలు చెల్లిస్తేనే నో డ్యూస్ సర్టిఫికెట్ ఇస్తామని అధికారులు తేల్చిచెప్పారు. చేసేదేమి లేక సదరు వ్యక్తి రూ.7.42 కోట్ల పన్ను బకాయిలు చెల్లించి ‘నోడ్యూస్’ సర్టిఫికెట్ పొందారు.