
ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ ప్రశ్న
హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ మరోసారి ట్విట్టర్ వేదికగా ప్రశ్న సంధించారు. సండే క్విజ్ పేరుతో ప్రశ్నలు వేసే ఆయన ఆదివారం ‘హే ట్వీపుల్స్.. గ్లోబల్ హెల్త్‌కేర్‌లో ప్రముఖమైన నోవార్టిస్ అతిపెద్ద క్యాపబిలిటీ సెంటర్, ప్రపంచవ్యాప్తంగా రెండో అతిపెద్ద ఫుట్ప్రిం ట్.. డాటా సైన్స్, అనలిటిక్స్, డ్రగ్ డెవలప్మెంట్, టెక్నాలజీ, ఫైనాన్స్ కార్యకలాపాల కోసం నిర్వహించే అతిపెద్ద కేంద్రం ఎక్కడుందో చెప్పండి?’ అని ప్రశ్నించారు. ఇందు కు సంబంధించిన ఫొటోలను కూడా మంత్రి పోస్ట్ చేశారు. అన్నట్టు మంత్రి ప్రశ్నకు సమాధానం ఏంటో తెలుసా.. నోవార్టిస్ అతిపెద్ద క్యాపబిలిటీ సెంటర్ ఉన్నది మన హైదరాబాద్‌లోనే. హైదరాబాద్ సత్తా ఇదీ అని నిరూపించేందుకే ఆయన ఈ ట్వీట్ చేశారు.
నష్టపోయిన రైతులను ఆదుకొంటాం